గుంతల పూడ్చివేతకు ఏఈ సహకారం

దమ్మపేట, ఆంధ్రప్రభ: పట్టణంలోని నాగేంద్రస్వామి గుడి వద్ద రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు పామాయిల్‌ ఫ్యాక్టరీ డిప్యూటీ మేనేజర్‌ ఎలక్ట్రికల్‌, ఏఈ ఉద్దగిరి రాజేష్‌ రెండు ట్రక్కుల యాష్‌ను అందించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి సెంటర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు గుంతల పూడ్చివేతకు యాష్‌ కావాలని ఆయనను కోరారు.

వెంటనే స్పందించిన ఏఈ రెండు ట్రక్కుల యాష్‌ను గుడి వద్దకు పంపించారు. కమిటీ సభ్యులు యాష్‌తో రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి చదును చేశారు. యాష్‌ను అందించిన ఏఈ ఉద్దగిరి రాజేష్‌కు గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.