రెండు బైకులు ఢీకొని ఏఈ మృతి..

ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవుడా సమీపంలోని కలవాటు వద్ద రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నార్నూర్ మండల మిషన్ భగీరథ ఏఈ కట్ట రాజు (27) మృతి చెందినట్లు ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, అతన్ని తక్షణమే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్సకు పంపించారు. ఎస్సై వివరాల ప్రకారం, మృతుడు ఎన్నికల విధులు పూర్తి చేసుకుని నార్నూర్‌కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుని తండ్రి కట్ట సంజీవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply