Adilabad | స్వచ్చందంగా గుడిసెల తొలగింపు..
Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం లింగాపూర్ బీట్ పరిధిలోని 380 కంపార్ట్ మెంట్(380 compartment)లో పోడు వ్యవసాయం పేరుతో అదివాసీలు వేసుకున్న గుడిసెలు ఈ రోజు స్వచ్చందగా వారే తొలగించడంతో అటవీ శాఖ అధికారులు ఊపిరి పిల్చుకున్నారు.
సుమారుగా వంద ఎకరాల అటవీ శాఖ భూమిలో దమ్మన్నపేట, మామిడిగూడ, బిల్క గూడలకు చెందిన 85 కుటుంబాలు పిచ్చి మొక్కలు, ఇతర జాతి చెట్లను నరికి భూమిని చదును చేసి కంది, చిక్కుడు, కూరగాయల చెట్లను సాగు చేశారు. అటవీ భూమిని కాళీ చేయాలని పలు మార్లు అధికారులు అదివాసీలకు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.
దీంతో గురువారం గుడిసెలు తొలగించేందుకు వందలాది అటవీ శాఖ సిబ్బంది రావడంతో అదివాసీలు తాము కలెక్టర్ తో మాట్లాడుతామని కోరడంతో కలెక్టర్ కార్యాలయానికి అదివాసీలు వెళ్లారు. కలెక్టర్ కుమార్ దీపక్ అటవీ భూములలో బొంగు చెట్లు పెంచెందుకు మీకు ఉపాధి కల్పిస్తామని సూమారుగా 70 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామి ఇవ్వడంతో అదివాసీలు సంతృప్తి చెంది ఈ రోజు స్వచ్చందంగా తమ సామన్లను తీసుకొని వెనుదిరిగారు.



