Adilabad | జనవరి 3,4 తేదీల్లో విభాగ్ స్థాయి ఖేల్ కూద్

Adilabad | జనవరి 3,4 తేదీల్లో విభాగ్ స్థాయి ఖేల్ కూద్
Adilabad | ముధోల్, ఆంధ్రప్రభ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో శ్రీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ( విభాగ్ స్థాయి ) ఖేల్ కూద్ (ఆటలు పోటీలు) ప్రారంభమవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖేల్ కూద్ లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్(Sri Saraswati Shishu Mandir) పాఠశాలల నుండి సుమారుగా 600 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
ఈ ఖేల్ కూద్ తేది:
03/01/2026 శనివారం రోజున మధ్యాహ్నం 2:00 గం.లకు ఉద్ఘాటనతో ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆదిలాబాద్(Adilabad) పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్, నిర్మల్ జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, శ్రీ సరస్వతి విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు భజరంగ్ లాల్ అగర్వాల్ పాల్గొననున్నారు.
ఈ ఖేల్ కూద్ తేది:
04/01/2026 ఆదివారం మధ్యాహ్నం 3:00 గం.లకు సమారోప్ కార్యక్రమంతో ముగుస్తుంది . ఈ కార్యక్రమంలో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్, శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్మల్ జిల్లా అధ్యక్షులు నార్లపురం రవీందర్, సూపరిండేంట్ సి.చ్.సి ముధోల్ డాక్టర్ అనిల్ జాదవ్ లు హాజరవుతున్నారని తెలిపారు.

ఈ ఖేల్ కూద్ ను వీక్షించడానికి ముధోల్ మండల కేంద్రములోని ప్రజలతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు ఇదే మా ఆహ్వానంగా భావించి విచ్చేయాలని పాఠశాల సమితి, ప్రబంధకారిణి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
