Adilabad | దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులను శిక్షించాలి

Adilabad | దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులను శిక్షించాలి

Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ కోర్టులో బుధవారం తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న న్యాయవాది పి.అనిల్ కుమార్ పైన అక్కడి సీఐ కృష్ణ, ఎస్సైలు సంజీవ్ అశోక్ లతో పాటు వారి సిబ్బంది తీవ్ర దౌర్జన్యానికి పాల్పడి న్యాయవాది వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేసిన పోలిసుల వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ కోర్టు ఎదుట కొద్దిసేపు నిరసన చేసి అనిల్ కుమార్ కు సంఘీభావం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి,ఉపాధ్యక్షుడు జగన్ నాయక్ మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న న్యాయవాదిపై కోర్టు ఆవరణలో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడడాన్ని తీవ్రంగాఖండిస్తున్నామన్నారు.

చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదని అలాంటిది పోలీసులు మర్చిపోయి చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. న్యాయవాదిపై దౌర్జన్యానికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేసి న్యాయవాద వృత్తిని అవమానపరచిన పోలీసు అధికారులపై వారికీ సహకరించిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.జైవంత్ రావు, న్యాయవాదులు జమీర్ ఖాన్, ధీరజ్ గుప్తా పెందూర్ ప్రభాకర్, చింతల గిరి శ్రీనివాస్,వసంత్ రావు, కుడెల్లి అశోక్, చంద్రమౌళి, నాతరి రాజు, జాదవ్ విశాల్, వినోద్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply