బీపీసీఎల్‌ సంస్థ ఏర్పాటుపై రైతులతో అదనపు కలెక్టర్‌ సమావేశం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో దండేపల్లి, గుంటూరుపల్లి గ్రామాల రైతులు, సర్పంచులతో జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌. రవి సమావేశమయ్యారు.

దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఆధ్వర్యంలో స్టాక్‌ నిల్వల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సంస్థ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను అదనపు కలెక్టర్‌ వివరించారు.ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు, సమస్యలు, సందేహాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వారి అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకునేలా చర్చించారు.

ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్‌, నాయబ్‌ తహసీల్దార్‌ రమేష్‌, దండేపల్లి, గుంటూరుపల్లి గ్రామాల సర్పంచులు, ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.