Varni | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

Varni | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

Varni | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని (Nomination center) గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) పరిశీలించారు. వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం నామినేషన్ కేంద్రంలో ఆయన రిటర్నింగ్ అధికారులతో చర్చించారు. నామినేషన్ ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎల్ పీఓ నాగరాజు, ఎంపీడీవో వెంకటేశం, ఎంపీ ఓ మారుతి, సత్యనారాయణపురం గ్రామ కార్యదర్శి సాయిలు ఉన్నారు.

Leave a Reply