Actress Mamitha Baiju: టాలీవుడ్‌లోకి క్రేజీ హీరోయిన్..?
జై హనుమాన్‌లో ఆ ముద్దుగుమ్మ కీలక పాత్ర..?
Actress Mamitha Baiju: మలయాళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటి మమితా బైజు (Actress Mamitha Baiju) టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రేములు’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు టాలీవుడ్‌లోని ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’. బ్లాక్‌బస్టర్ హిట్ ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, మరో కీలక పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో రాణా కనిపించనున్నట్లు సమాచారం.
మమితా బైజు ఎంట్రీ..
రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌లో ఓ ప్రాధాన్యమున్న పాత్ర కోసం చిత్రబృందం మమితా బైజు (Actress Mamitha Baiju)ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రబృందం ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాతో మమితా బైజు (Actress Mamitha Baiju) టాలీవుడ్‌లోనూ తన హవా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
