చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల, ఆంధ్రప్రభ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎగ్గాడి భాస్కర్ ప్రజలను హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని గంగారెడ్డి రోడ్డు, మార్కెట్ రోడ్డులోని మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు తప్పవని వాహన చోదకులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉలంఘిస్తే ఆర్టీఓ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రానున్నదసరా, దీపావళి సందర్భంగా తెలంగాణలోనే మెజారిటీ సభ్యులు నిర్వహించుకునే దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రం మంచిర్యాల పట్టణంలో వ్యాపార సముదాయాల ప్రాంతాల్లో జన సంద్రోహం పెరిగిపోతుందన్నారు. ఇతర జిల్లాల నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా కొనుగోలుదారులతో పట్టణం కిక్కిరిసిపోతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీస్ నిఘా పెంచి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు అనుమానాస్పద వ్యక్తులను విచారించి కట్టుదిట్టమైన భద్రత మధ్య నాకా బందీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల సీఐ ప్రమోద్ రావు, మంచిర్యాల రూరల్, శ్రీరాంపూర్ సీఐల తోపాటు ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
