Achampeta | అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Achampeta | అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
- పోలీసుల దర్యాప్తు ప్రారంభం
అచ్చంపేట, (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. గత ఏడాది నుంచి అచ్చంపేటలో నివాసం ఉంటున్న నేనావతు లక్ష్మణ్ (38) ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పడిఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సూచన అందుకున్న వెంటనే అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం చర్యలు చేపట్టారు.
లక్ష్మణ్ మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో, మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు.
మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
