TG | బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్ట్..
TG | బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్ట్..
రూ.20 లక్షల కోసం డిమాండ్..
నీటి సంపులో బాలిక మృతదేహం
TG | సికింద్రాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన అతను గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉద్యోగం నుంచి తొలగించిన కొద్ది రోజులకే చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కౌకూరులోని విల్లా ఆర్కిడ్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు.. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కిడ్నాప్ వ్యవహారంలో దొరికిపోతాననే భయంతో నిందితుడు బాలిక కాళ్లు, చేతులు కట్టేసి అపార్ట్‌మెంట్‌లోని నీటి సంపులో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. కిడ్నాప్, హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
