Accident | లోయలో పడ్డ ఆర్మీ వాహనం – ముగ్గురు జవాన్లు దుర్మరణం

జమ్మూకశ్మీర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఆర్మీ వాహనం రాంబన్ జిల్లా పరిధిలోని ఓ లోయలో పడిపోయింది. 700 అడుగుల వ్యాలీలోకి పల్టీలు కొడుతూ వాహనం పడిపోవడంతో అందులోని ముగ్గురు జవాన్లు మృతి చెందారు.

మరణించిన వారు అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహుదూర్ లు ఉన్నారు. వారి మృత దేహాలను లోయలోంచి బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు.

.

Leave a Reply