Accident | ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృతి

Accident | ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృతి

Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్ర‌భ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ వంతెన పిల్లర్‌ నంబర్‌ 97 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Accident

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8మంది విద్యార్థులున్నారు. మౌలాలి నుంచి పోచారం వెళ్తుండగా కారు అతివేగంగా వెళ్లి పిల్లర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను సాయివరుణ్‌ (23), నిఖిల్‌ (22)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్‌, రాకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు యశ్వంత్‌, సాత్విక్‌, హర్షవర్ధన్‌, అభినవ్‌ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply