ACB searches | ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబి సోదాలు..

ACB searches | ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబి సోదాలు..
ACB searches | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ సింగ్ నగర్ నార్త్ ఎమ్మార్వో కార్యాలయంలో శనివారం ఏసీబి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తాహసిల్దార్ అప్పారావును అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే గుర్తు తెలియని వ్యక్తి ఫ్యామిలి మెంబెర్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అప్పారావును కలిశాడు. అందుకు 12వేలు లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ 12వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా డిప్యూటీ తాహసిల్దార్ అప్పారావును అరెస్ట్ చేశారు.
అవినీతి తిమంగళం అప్పారావు…
గతంలో పశ్చిమ తహశీల్దార్ కార్యాలయంలో అప్పారావు పనిచేయగా, అక్కడ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి.ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో అనేక అక్రమాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి తిమింగలం అని ఆయనకు అక్కడ వారు పేరు పెట్టడం గమనార్హం. అక్రమాలను తిమ్మిని బమ్మి చేయడంలో సామర్థ్యం కలిగిన సిద్ధహస్తుడని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
