జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు!

సూర్యాపేటలోని నివాసంలో తనిఖీలు.. పలు ప్రాంతాల్లో ఆస్తులపై ఆరా

సూర్యాపేట, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నల్లబోతు యాదగిరికి సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏసీబీ అధికారులు సూర్యాపేటతో పాటు యాదగిరికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లోనూ ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.ఏసీబీ తనిఖీలు పూర్తయిన తర్వాత అధికారులు వెల్లడించే వివరాలతో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.