హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాలపై ఏసీబీ (ACB) కేసు మేరకు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ (Sridhar) రిమాండ్‌లో ఉన్నట్లు తెలిసిందే. అయితే ఈఈ శ్రీధర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.150 కోట్లకు పైగా శ్రీధర్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ప్రాథమికంగా సమాచారం. అక్రమాస్తుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని.. వారం రోజుల పాటు శ్రీధర్ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.
మరికొందరి అధికారులపై ఏసీబీ ఆరా
అక్రమాస్తుల కేసు (Disproportionate assets case) లో పట్టుబడిన కాళేశ్వరం ఈఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. దీంతో మరి కొంతమంది అధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. శ్రీధర్ అక్రమాలు, అవకతవకలు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ రాహుల్ బొజ్జా దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు ఈఎన్‌సీ అనిల్, శ్రీధర్ సంబంధాలపై కూడా ఏసీబీ ఆరా తీస్తుందని తెలుస్తోంది.