ACB officials | ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అసిస్టెంట్ ఇంజనీర్…

ACB officials | ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అసిస్టెంట్ ఇంజనీర్…
ACB officials | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేటలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు జరిపిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు, ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 24,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. అయితే, ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ సత్యనారాయణ చార్యులు లంచం డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా, ముందస్తు ప్రణాళికతో దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది.

