అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

మండల విద్యాధికారి జీవన్ కుమార్

అచ్చంపేట ఆంధ్రప్రభ : విద్యార్థులు మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్ కోరారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హరిత ఫౌండేషన్ సభ్యుడు ఆర్. జ్యోతిలాల్ సమన్వయంతో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర, సాధించిన విజయాలు, దేశానికి చేసిన సేవలు అనే అంశంపై మండల స్థాయిమండల స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మండలంలోని 12 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జీవన్ కుమార్ మాట్లాడుతూ “విద్యార్థులు ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆదర్శాలను అనుసరించి కృషి చేస్తే, భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు” అని, పోటీ ప్రపంచంలో కృషి ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మహిళలు కూడా ప్రతి రంగంలో ముందంజలో ఉండాలని” విద్యార్థులకు సూచించారు. హరిత ఫౌండేషన్ సభ్యుడు జ్యోతిలాల్ మాట్లాడుతూ మండలంలోని 12 పాఠశాలల నుండి ఎంపికైన 24 మంది విద్యార్థులను ఈ నెల 24న హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం, మరియు ఇస్రో రీసెర్చ్ సెంటర్‌లను సందర్శించడానికి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల్లో బహుమతులు మొదటి బహుమతిని బి. అనిల్ (జిహెచ్ఎస్ అచ్చంపేట), రెండవ బహుమతిని పి. అంజలి (జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ అచ్చంపేట), మూడవ బహుమతిని ఎం. శ్రావణి (పి.టి.జి. ఐనుల్ పాఠశాల) సాధించారు. విజేతలకు మొమెంటోలు, సర్టిఫికెట్లు, పుస్తకాలు అందజేయగా, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన హరిత ఫౌండేషన్ సభ్యులు జ్యోతిలాల్ ను పాఠశాల సిబ్బంది, ఎంఈఓ జీవన్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంలు సరళ, గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, హరిత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply