ఓటు వేసేందుకు వచ్చి ఫిట్స్ తో పడిపోయిన యువతి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కొండపల్లి మున్సిపల్ పోలింగ్ కేంద్రం వద్ద 38వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన యువతి బూత్‌లో ఆకస్మాత్తుగా ఫిట్‌తో వచ్చి పడిపోయింది. 38వ వార్డు ఓటరు భాగ్యలక్ష్మి(25) ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆదివారం బూత్ లోకి వెళ్లి ఫిట్స్ తో పడిపోయింది.
వెంటనే వైద్య సిబ్బంది ఆమెకు సపర్యలు చేశారు. సుమారు పది నిమిషాల పాటు పోలింగ్ సిబ్బంది పోలింగ్ ను నిలిపివేశారు. అనంతరం యథావిధిగా పోలింగ్ కొనసాగింది. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయింది.
