ప్రమాదం నుండి బయట పడ్డ రైల్వే సిబ్బంది


కేసముద్రం, ఆగస్టు 8(ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రెస్ట్ రైలు బోగి (Rest train bogie) లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. కేసముద్రం రైల్వే స్టేషన్ (Kesamudram Railway Station) లో మూడవ లైన్ వేస్తున్నారు. ఈక్రమంలో రైల్వే టెక్నీకల్ ఉద్యోగుల రెస్ట్ కోసం ఓ బోగిని ఏర్పాటు చేసుకున్నారు.

భారీగా కురుస్తున్న వర్షంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆగి ఉన్న ఆ రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ (Short circuit) తో మంటలు వ్యాపించాయి. దీంతో గమనించిన అందులో నిద్రిస్తున్న సిబ్బంది అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేశారు. బోగిలో మంటలు (bogie Fire ) వ్యాపిస్తుండడంతో అందులో ఉన్న సిబ్బంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.

రైల్వే స్టేషన్ లో మూడో రైల్వే లైన్ పనుల (Third railway line works) నిర్వహణలో భాగంగా సిబ్బంది కోసం ఒక ప్రత్యేక రైల్వే బోగి రెస్ట్ కోసం తెచ్చి నిలిపి ఉంచారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించి భోగి పూర్తిగా దగ్ధమైంది. కాగా ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా బోగిలో మంటలు పూర్తిగా వ్యాపించి బోగి పూర్తిగా దగ్ధమైంది. సంఘటన గురించి తెలిసిన కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ పోలీస్ లతో చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Leave a Reply