అబ్జార్ప్షన్ పూర్తయ్యాకే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి
టీచింగ్ ఉద్యోగులకు 7వ పీఆర్సీ, ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రభుత్వానికి టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. కృష్ణప్రసాద్ డిమాండ్
బాసర, ఆంధ్రప్రభ: టీచింగ్ ఉద్యోగుల అబ్జార్ప్షన్ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో టీచింగ్ ఉద్యోగులు సమావేశమై తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. తాము కొత్త నోటిఫికేషన్‌కు వ్యతిరేకం కాదని, అయితే ముందుగా అబ్జార్ప్షన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు 7వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాలని, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డా. విజయ్‌కుమార్, డా. సాయికృష్ణ, డా. వినోద్, సతీష్‌కుమార్, డా. రాములు, డా. సురేష్, డా. అజయ్, శ్రీకాంత్, ప్రభాకర్, హరికృష్ణ, జాకీర్ అహ్మద్, స్వప్నిల్ జంగాలే తదితరులు పాల్గొన్నారు.
