ములకలూరులో వ్యక్తి దారుణ హత్య…

నరసరావుపేట (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. నరసరావుపేట మండలం అగ్రహారానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు గడ్డపార కర్రలతో దాడి చేశారు.

ఈ దాడిలో పర్వతాలు ఘటనా స్థలంలోని కుప్పకూలి మృతి చెందారు. కొన్నాళ్లుగా ఆగ్రహరంలో ఓర్చు ముసలయ్యకి వేముల వెంకటేశ్వర్లుకి మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదాల కారణంగా కొన్నేళ్లుగా పర్వతాల అనే వ్యక్తి దేచవరంలో నివాసం ఉంటున్నారు.

అగ్రహారంలో గడ్డిమోపు విషయంలో ములకలూరు వద్ద పొలంలో ఉన్న వేముల వెంకటేశ్వర్లు కి మృతుడు పర్వతాలు, తమ్ముడు కొడుకు ఓర్చు కోటేశ్వరావు కి వివాదం జరిగింది.

ఈ వివాదాలను గురించి తెలుసుకోవడానికి దేచవరం నుంచి మృతుడు పర్వతాలు ములకలూరు వద్ద ఉన్నటువంటి పొలం వద్దకు వచ్చి మాట్లాడే సమయంలో పర్వతలని కొందరు ప్రత్యర్థులు కర్రలు గొడ్డలితో దాడి చేయడంతో మృతి చెందారని పర్వతాలు బంధువులైతే ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా ఈ వివాదంలో మరో వ్యక్తి కోటేశ్వరరావు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో కావడంతో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు

Leave a Reply