ఉల్లిపాయల లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు..
రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన ఉల్లిపాయల బస్తాలు
గుంటూరు వెస్ట్ క్రైం, అక్టోబర్ 12(ఆంధ్రప్రభ ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) సమీపంలోని దశావతార టెంపుల్ వద్ద సోమవారం ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి హైవే పక్కన ఉన్న సైడ్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. లారీ బోల్తా పడటంతో అందులో ఉన్న ఉల్లిపాయల బస్తాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ లారీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి కర్ణాటకకు ఉల్లిపాయల లోడుతో వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
