ఏ రాష్ట్రమైనా అన్ని రంగాలలో ముందుండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి అన్నివైపుల నుండీ జరగాలి. అందులో మౌలిక అవసరాల వసతుల కల్పన ప్రాధాన్యమైనది. అంటే, విద్య, వైద్యం, ఉపాధి రంగాలు. ఇక ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశం పారిశుద్ధ్యం (Sanitation).
ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపేదీ, అతిథులు ఆయా రాష్ట్రాలకు విచ్చేసినప్పుడు అక్కడి ప్రజల జీవన శైలి(lifestyle)ని ప్రతిబింబించేదీ ఆ రాష్ట్రంలోని పరిశుభ్రమైన పరిసరాలే. ఏపీలో చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి (Special focus on sanitation) సారించింది.
కలెక్టర్ల సమావేశం(Collectors’ meeting)లో చంద్రబాబు ఇదేవిషయాన్ని ఆదేశించారు. ఉద్యమ స్పూర్తితో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని (Swachhandhra programme) కొనసాగించాలని కోరారు. జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడా కనిపించకూడదనీ, 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేసామనీ తెలిపారు.
చెత్తపై పన్ను కూడా రద్దు చేశా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్నప్పుడు పచ్చదనం-పరిశుభ్రత పేరుతో చంద్రబాబు పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆచరింపజేసి ఒక ఉద్యమంలా ప్రజల్లో చైతన్యం తెచ్చారు.
అయితే, ఇది కార్యాచరణ వరకు వచ్చేసరికి ఎంతవరకు సాధ్యమనేది ఆలోచించాల్సిన విషయం. పారిశుద్ధ్య నిర్వహణ అనేది ఒక్కరోజు, ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఆదేశాలతో సరిపోదు. క్షేత్రస్థాయిలో నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఇందులో ముఖ్యంగా ప్రజల పాత్ర కూడా కీలకం.
చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదనే అవగాహన పౌరుల్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని ఆచరించాలి. నిర్దేశించిన డబ్బాల్లోనే చెత్తవేయడం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి ఉండాలి. అప్పుడే సీ ఎం నిర్దేశించిన స్వచ్చాంధ్ర లక్ష్యం నెరవేరుతుంది.

