(ఆంధ్రప్రభ, మదనపల్లి) : అన్నమయ్య జిల్లా మదనపల్లి ఇందిరానగర్‌లో చిత్తు కాగితాలు ఏరుకొని బతుకు ఈడ్చుతున్న ఓ అనాథ యువకుడు శనివారం మరణించాడు. ఈ మృతదేహాన్ని టూ టౌన్ పోలీసులు బోధనాసుపత్రి మార్చురీకి తరలించారు.
అతని కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందానికి ఈ సమాచారం అందించారు. ఖబరాస్తాన్‌లో ఇస్లాం సంప్రదాయ పద్ధతిలో పవిత్రంగా అంత్యక్రియలు నిర్వహించారు.
హిందూ–ముస్లిం సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఏ మృతదేహాన్ని అనాథగా వదలమని మత సామరస్యంతో సేవలు అందిస్తామని వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు.