డాక్టర్లే గుర్తించలేని వ్యాధా..
మానవపాడు, ఆంధ్రప్రభ : ప్రపంచ దేశాల్లో నలుమూలల ఏదో ఒక జీవికి వింత వ్యాధులు సోకుతూ ఉంటాయి. ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లాలో (Gadwal) ఉండవెల్లి మండలం కంచుపాడు (Kanchupadu) గ్రామంలో ఇలాంటి కొత్త వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అయితే.. మనుషులకు కాకుండా కుక్కలకు ఈవ్యాధి సోకడం గమనార్హం.
ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలతో పాటు ఊరిలోని శునకాలకు శ్వాసకోశ పరమైన ఇబ్బందులు ఏర్పడి మరణిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లోనే ఈ గ్రామంలోని 20 శునకాలు మరణించినట్లు పారిశుద్ధ్య కార్మికులు తెలుపుతున్నారు. పశువైద్య అధికారులు మాత్రం అంతుచిక్కని వ్యాధులు అంటూ స్పందిచడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.


