plane | సిగరెట్ తాగిన ప్రయాణికుడు
plane | శంషాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : విమానం (plane) లో సిగరెట్ తాగిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన సంఘటన గురువారం అర్జీఐ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. సిఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బైమా నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న 6ఈ 1496 ఇండిగో విమానంలో ప్రయాణికుడు మహమ్మద్ మోహిద్ (Mohammed Mohid) విమానం టేకప్ తీసుకున్న తర్వాత విమానంలో నిషేధిత సిగరెట్ కాల్చాడు. గమనించిన విమాన సిబ్బంది పైలెట్ కు సమాచారం అందించారు.
పోలీసుల (Police) కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. పైలెట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. విమానాల్లో సిగరెట్ కాల్చడం నిషేధం… కానీ ప్రయాణికుడు విమాన సిబ్బందితో వినకుండా సిగరెట్ తాగాడని ప్రయాణికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకుని సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

