AP | నలుగురిని కాపాడిన స్థానికులు…
AP | నలుగురిని కాపాడిన స్థానికులు…
నలుగురిని కాపాడిన స్థానికులు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో పెను ప్రమాదం తప్పింది. గాదరాడ–కనుపూరు గ్రామాల మధ్య వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు.
వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. అప్రమత్తంగా వ్యవహరించి కారులో ఉన్న నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అనంతరం స్థానికులు జేసీబీ సహాయంతో వరదలో కొట్టుకుపోయిన కారును బయటకు తీశారు. స్థానికుల సమయస్ఫూర్తి, చొరవతో నలుగురి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ ఘటనతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
