పాలసీ మేకర్‌గా 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం.. ప్రజల ఆశీర్వాదమే నడిపించింది: మోదీ

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్‌డెస్క్‌: ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని సేవా సంకల్ప జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి సేవా సంకల్ప యాత్రికులు కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు.

రాజకీయాల్లో పాలసీ మేకర్‌గా మోదీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకుంది. స‌రిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని ప్ర‌ధాని న‌రేంద‌ర్ మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దేశ ప్రజల సేవలోనే తన పాతికేళ్ల ప్రయాణం కొనసాగిందన్నారు. 25 ఏళ్లుగా నిరంతర ప్రజా సేవా ప్రస్థానంలో ప్రజల ఆశీర్వాదమే తనకు బలంగా నిలిచిందని చెప్పారు. ప్రజల నమ్మకం, ఆశీర్వాదంతోనే తాను ముందుకు సాగుతున్నానని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల మద్దతే తనకు బలమని తెలిపారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎన్నటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. ప్రజా సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తినిచ్చారని, ప్రజలు, దేవుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానని తెలిపారు. సవాళ్లే తనను మరింత బలంగా నిలబెట్టాయని, దేశం తనకు ఎంతో ఇచ్చిందని.. దేశమే తనకు ప్రథమ మొద‌టి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.