TG | ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వండి – రేవంత్ ను కోరిన సిపిఐ బృందం

హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో ఒక సీటు త‌మ పార్టీకి కేటాయించ‌వ‌ల‌సిందిగా సిపిఐ పార్టీ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరింది.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఇప్ప‌డు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందేన‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు అన్నారు.. సిపిఐ బృందం నేడు రేవంత్ ను ఆయ‌న నివాసం లోకి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై త‌మ అభిప్రాయాల‌ను తెలిపింది. అనంత‌రం కూనంనేని మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది తప్పితే.. ఆయా పార్టీలు అలాగే కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రతిబింబించవు అని అన్నారు. అలాగే, కాంగ్రెస్- సీపీఐ పార్టీల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారంగా తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు దొమ్మాట సాంబయ్యకు ఇవ్వాలని కోరామ‌ని,.. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీతో మాట్లాడి నిర్ణయం చెబుతాను అన్నారని కూనంనేని సాంబశివ రావు వెల్లడించారు.

కాగా, రేవంత్ తో జ‌రిగిన సమావేశంలో కూనంనేని తో పాటు , సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఈటీ నరసింహ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *