kruthivennu | సీ.ఎస్.ఆర్ ఫండ్స్ విడుదలకు చర్యలు తీసుకోవాలి

kruthivennu | సీ.ఎస్.ఆర్ ఫండ్స్ విడుదలకు చర్యలు తీసుకోవాలి
ఎంపీ బాలశౌరి
kruthivennu | కృత్తివెన్ను – ఆంధ్రప్రభ : పెడన హిందూ స్మశాన వాటిక అభివృద్ధి నిమిత్తం సీ.ఎస్.ఆర్ ఫండ్స్ మంజూరులో ఉన్న సాంకేతిక అంశాలను హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ ఎంపీ బాలశౌరికి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కి వివరించడం జరిగింది. ఇవాళ కృత్తివెన్ను మండల పరిధిలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ బాలశౌరిని, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ని కలిసి హిందూ స్మశాన వాటిక అభివృద్ధిలో జరుగుతున్న పురోగతికి రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఈనేపథ్యంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి సంబంధిత కార్పొరేట్ సంస్థ ప్రతినిధులకు, అధికారులను వెంటనే ఫోన్ ద్వారా సంప్రదించి సీ.ఎస్.ఆర్ ఫండ్స్ విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయని హిందూ స్మశాన వాటిక వినియోగించుకున్న సామాజిక వర్గాల సహకారం కూడా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని, గత రెండు రోజుల క్రితం సంబంధిత కార్పొరేట్ ప్రతినిధులను స్వయంగా కలవటం జరిగిందని ఎంపీ బాలశౌరి కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొడ్డు దీక్షానందుడు, కార్యదర్శి వాసా సాంబశివరావు, వూటుకూరి ప్రకాశరావు, బళ్ల ప్రసాద్, కమ్మగంటి వెంకటేశ్వరావు, చందన నారాయణరావు, పృథ్వీ వినోద్, తదితరులు పాల్గొన్నారు.
