Yadadri | ధనుర్మాస శోభాయాత్ర..

Yadadri | ధనుర్మాస శోభాయాత్ర..
Yadadri, ఆలేరు, ఆంధ్రప్రభ : అపర వైకుంఠంగా పేరొందిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నగర ఆధ్యాత్మిక శోభాయాత్ర ఎంతో ఘనంగా జరిగింది. కోలాటం నృత్య ప్రదర్శనలు, ఆధ్యాత్మిక భజన గీతాలాపనల మధ్య శ్రీరంగనామస్మరణతో ఉత్సవమూర్తులతో శోభాయమానంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శోభాయాత్ర ప్రారంభానికి ముందు స్వామి వారి ఆలయంలో మహిళా భక్తులతో సామూహిక మంగళ హారతుల నివేదన, పాశురాల పఠనం శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు, ఆలయ చైర్మన్ మోర్తల గోపిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
