Safety kits |కల్లు గీత కార్మికుడు కిట్లను వినియోగించుకోవాలి…

Safety kits |కల్లు గీత కార్మికుడు కిట్లను వినియోగించుకోవాలి…
- పలు గ్రామాల్లో కాటమయ్య రక్షణ కవచం వాడకంపై శిక్షణ కార్యక్రమం
- జనగామ జిల్లా కాటమయ్య రక్షణ కవచం జిల్లా కోఆర్డి నేటర్ బాల్నే వెంకట మల్లయ్య
Safety kits | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి, మీదికొండ, తాటికొండ, చాగల్లు గ్రామాల పరిధిలోని తాటి చెట్ల సమీపంలో ఈ రోజు కాటమయ్య రక్షణ కవచం వాడకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనగామ జిల్లా కాటమయ్య రక్షణ కవచం జిల్లా కోఆర్డి నేటర్ బాల్నే వెంకట మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సంద ర్భంగా బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా ప్రవేశపెట్టిన కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను జనగామ జిల్లాలో 1875 మంది(1875 people) కల్లు గీత కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కిట్లను పొందిన ప్రతి కల్లు గీత కార్మికుడు తప్పనిసరిగా వినియోగించు కోవాలని ఆయన కోరారు.
తాటి చెట్లపై పని చేసే సమయంలో జారి పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, కాటమయ్య రక్షణ కవచాన్ని ఉపయోగించడం ద్వారా చెట్టు పై నుంచి జారినా కింద పడకుండా ప్రాణాపాయం లేకుండా ఉండే అవకాశముందని వివరించారు. అందు వల్ల ప్రతి కల్లు గీత కార్మికుడు(toddy tapper worker) సేఫ్టీ కిట్ల(safety kits)ను తప్పనిసరిగా వాడాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్లు కుర్ర కుప్పలయ్య, కను కటి రాజయ్య, బాల్నే కార్తీక్, మూల వైకుంఠం, కేజీకేఎస్ మండల అధ్యక్షులు, కార్యదర్శులు మాచర్ల రఘురాములు, పులి శ్రీనివాస్, కొత్తపల్లి సర్పంచ్ స్వరూప రవి కుమార్ యాదవ్, ఉప సర్పంచ్ గోవిం దు ఇసాక్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎండి దస్తగిరి, యాకూబ్ పాషా, కుల పెద్దమనిషి వడ్లకొండ రమేష్, టిసిఎస్ అధ్యక్షులు బూరు వెంకటేశ్వర్లు, గట్టు చిన్న కుమార్, బూరు మల్లేశం, గోవిందు ఏశుబు, లక్ష్మణ్ మూర్తి, మాచర్ల బుచ్చయ్య, ఇల్లందుల శీను, బొంగోని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
