Puri-Tirupati train | రైలులో అగ్నిప్రమాదం

Puri-Tirupati train | రైలులో అగ్నిప్రమాదం
Puri-Tirupati train | తుని, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో ఇవాళ ఓ రైలులో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. పూరి – తిరుపతి (17479) రైలులోని B5 బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం 6 గంటల సమయంలో తుని నుంచి అన్నవరం మధ్య చేరుకునే సమయంలో రైలు బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు (Electrical panel board) వద్ద దుప్పట్లకు మంటలు అంటుకున్నాయి.
అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. కాలిపోయిన దుప్పట్లను తొలగించారు. అనంతరం రాజమహేంద్రవరం స్టేషన్ (Rajahmundry Station) లో రైలును నిలిపి బోగీని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. ప్యానల్ బోర్డు వద్ద ప్రమాదం జరిగిందా? లేక ప్రయాణికులు ఎవరైనా సిగరెట్లు కాల్చారా? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
