7Talented | నిపుణులకు కొలువు.. నైతికతకు నెలవు!!

7Talented | నిపుణులకు కొలువు.. నైతికతకు నెలవు!!
ఆంధ్రప్రదేశ్ సచివాలయము అమరావతి
- ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న పంథా సలహాదారుల నియామకంలో ప్రత్యేక ముద్ర
- రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యం
- సమర్థులు.. నిపుణులకే అవకాశం
- రాజకీయ నిరుద్యోగులకు నో
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో ఘనకీర్తి యువతకు ప్రాధాన్యమిచ్చే రంగాలపై మంత్రి లోకేష్ ఫోకస్
- శాస్త్ర, సాంకేతికత, చేనేత రంగాలతో పాటు నైతిక విలువలకూ చోటు
- ప్రకృతి వైద్యం.. మాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో మహాకూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాటు.. యువనేత నారా లోకేష్ సారథ్యంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలకు ఆస్కారం లేని విధంగా ముందుకు సాగుతూ.. పకడ్బందీ చర్యలు చేపడుతోంది. కూటమి ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల విషయంలోనూ రాజకీయ ప్రయోజనాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు భావితరం బాగుండాలనే సంకల్పం కనిపిస్తోందంటూ అన్నివర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోరెన్సిస్ సైన్స్.. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్.. స్పేస్ టెక్నాలజీ.. చేనేత.. హస్తకళల అభివృద్ధి అంశాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారులను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తను సైతం సలహాదారుగా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖలతో పాటు.. ప్రకృతి వైద్యం.. మాస్ కమ్యూనికేషన్ విభాగాలకు సమర్థులను సలహాదారులుగా నియమించడం కమ్యూనికేషన్, ఆధ్యాత్మిక రంగాలకు పెద్దపీట పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజకీయంగా వచ్చే లబ్ధికంటే కూడా గురుతర బాధ్యత కలిగిన యువతరాన్ని అందించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించి, అనుచరవర్గంలోని కొందరిని అక్రమ పద్ధతుల్లో సలహాదా రులుగా నియమించుకుంటున్న పరిస్థితులు గతంలో కనిపించేవి. కానీ నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కూటమి అగ్ర నేతలు రాజకీయం కంటే విద్యార్థుల భవితవ్యానికి అవసరమైన శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి, చేనేతన్నలకు ప్రోత్సాహం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి మేళవింపు, నైతిక విలువలను నేర్పి, భారతీయ సంస్కృతిని అలవర్చేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నట్లు కనిపిస్తోంది.
స్పేస్ టెక్నాలజీ విభాగా లకు శ్రీధర పణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాలకు జీ.సతీష్ రెడ్డి, ఏపీ ఫోరెన్సిక్ విభాగానికి కేపీసీ. గాంధీ, హస్తకళలు, చేనేత అభివృద్ధి శాఖలకు సుచిత్రా ఎల్లా, విద్యాశాఖ, నైతిక విలువలకు చాగంటి కోటేశ్వరరావు, ప్రకృతి వైద్యం మంతెన సత్యనారాయణ రాజు, మాస్ కమ్యూనికేషన్ పోచంపల్లి శ్రీధర్ (కార్టూనిస్ట్ శ్రీధర్), దేవాదాయ శాఖకు చుం డూరి సీతారామాంజనేయ ప్రసాద్లను ఏపీ ప్రత్యేక సలహాదారులుగా నియమించి, క్యాబినెట్ ర్యాంక్ కల్పించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకృతివైద్యం..మంతెన బంధం

ప్రకృతికి ప్రతిరూపంగా కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అంటే తెలియని వారుండరు. అలాంటి ప్రకృతిని ప్రేమించే వ్యక్తిగా పేరొందిన ఆయనను నేచురోపతి సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. నేచురోపతి వైద్యుడుగా, యోగా గురువుగా, రచయితగా ప్రకృతి వైద్యరంగంలో ఆయన గత 40ఏళ్లకు పైగా ప్రయాణం సాగిస్తున్నారు. ఔషధాలు లేకుండా ఆహార నియమాలు, యోగా, ఉపవాసం, జీవనశైలి మార్పులతో వ్యాధుల నివారణ వంటి అంశాల్లో ఆయన విశేష గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ప్రకృతి వైద్యంతో లక్షలమందికి నేరుగా చికిత్సనందించిన ఆయన, కోట్ల మందికి అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో నేచురోపతి ఆస్పత్రులు, యోగాకేంద్రాలు, జీవనశైలి వ్యాధుల నియంత్రణ పాలసీలపై ఆయన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.., మధుమేహం నయం కావచ్చు, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది.?, క్యాన్సర్ ఎందుకు వస్తుంది?, డాక్టర్ లేకుండానే బతకండి వంటి రచనలతో ఆయన ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
అరుదైన మూలిక మొక్కల పెంపకంతో భవిష్యత్ ప్రజల ఆరోగ్యాలను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఆయనకు సలహాదారుగా పదవినిచ్చి, గౌరవించింది. ఆహారమే ఔషధం – ఔషధమే ఆహారం అనే సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచేఆయన 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అంతేకాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య పురస్కారాలను సొంతం చేసుకున్నారు. జీవనశైలితో వ్యాధులపై భారతదేశంలో అతిపెద్ద ప్రజా ఉద్యమాన్ని ఆయన సృష్టించారు.
స్పేస్ టెక్నాలజీ విభాగానికి డా.శ్రీధర పణిక్కర్ సోం నాథ్

రాష్ట్రంలో విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఇస్రో మాజీ చైర్మన్, విక్రమ్ సారాభాయ్ స్పేసెంటర్ (వీఎస్ఎస్సీ) ప్రొ.డాక్టర్ శ్రీధర పణిక్కర్ సోమాథ్ను ప్రత్యేక సలహాదారుగా రాష్ట్ర ప్రభు త్వం నియమించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆయన బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్, ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ విభాగంలో పీహెచ్సీ పూర్తి చేశారు. 1985లో ఇస్రోలో చేరిన ఆయన, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురంలో తన కెరీర్ ప్రారంభించారు. 2022 జనవరి 14 నుండి 2023 డిసెంబర్ వరకు ఇస్రో చైర్మన్ గా సేవలందించారు. వీఎస్ఎస్సీ డైరెక్టర్గా 2018 నుంచి 2022 వరకు అంతకు ముందు ఆయన పనిచేశారు. స్పేస్ కమిషన్ చైర్మన్గానూ ఆయన కొనసాగారు. స్పెస్ డిపార్ట్మెంట్ సెక్రెటరీగానూ సేవలం దించారు. చంద్రయాన్-3 వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ల్యాండింగ్ విజయవంతా నికి ఆయన నేతృత్వం వహించారు. మానవ సహిత అంతరిక్షయాత్ర ప్రాజెక్ట్ గగన్యోనక్కు రూపకర్తగా నిలిచారు.
లీవీఎం-3(గగన్యాన్ రాకెట్) అభివృద్ధిని ఆయన పర్యవేక్షించారు. ఇస్రో ప్రైవేటైజేషన్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా అనేక జాతీయ శాస్త్ర, సాంకేతికరంగాల్లో ప్రత్యేక గుర్తింపును, అవార్డులను సొంతం చేసుకున్నారు.
నేతకారులకు చేయూత ఇచ్చేందుకు డా. సుచిత్ర ఎల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా పేరుగాంచిన కులవృత్తిదారులైన నేతకారులకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సుచిత్ర కె. ఎల్లాను సలహాదా రుగా నియమించింది. హైదరాబాద్ కు చెందిన ఆమె భారత్ బయోటెక్ వ్యవస్థాప కుడు డా. కృష్ణ ఎల్లా కుమార్తె. బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీలో మాలిక్యులర్ బయాలజీ, ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (స్పెయిన్)లో పూర్తి చేసిన ఆమె, భారత్ బయోటెక్లో కీలకపాత్ర పోషించారు. భారత్ బయో టెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్)లో ఆమె మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతూ వ్యూహాత్మక నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
వ్యాక్సిన్ పరిశోధన, అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో ఆమె కీలక పాత్ర పోషిం చారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడు ఎదర్కొనేందుకు రూపొందించిన కోవాక్సిన్ అభివృద్ధి, తయారీ, ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు. పోలియో, హెపటైటిస్, రేబిస్, టైఫాయిడ్, రోటావైరస్ వంటి టీకాల అభివృద్ధి, భారత్ బయోటెక్కు ప్రపంచస్థాయి వ్యాక్సిన్ బ్రాండ్గా నిలపడంలోనూ ఆమె విశేష కృషి చేశారు. 2024లో పద్మభూషణ్, వుమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ వంటి పురస్కారాలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఫార్మా, బయోటెక్ రంగాల్లో అనేక గౌరవ పురస్కారాల ను అందుకున్నారు. మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో ఫర్ ది వరల్డ్ వ్యాక్సిన్ విజన్కు ఆమె ప్రతీకగా నిలిచి, భారతదేశ వ్యాక్సిన్ స్వావలంబనకు మార్గదర్శకురాలిగా మారారు.
ధార్మిక సేవలకు అరుదైన గుర్తింపు

ఆధ్యాత్మికరంగంలో తనదైన ముద్ర వేసిన చుండూరు సీతా రామాంజనేయ ప్రసాద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధా న్యతనిచ్చి, దేవాదాయ శాఖ సలహాదారుగా నియమించింది. దేవాలయాల్లో అభివృద్ధి, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు అవసరమైన మార్పులు, చేర్పులకు ఆయన సలహాలు సూచనలను అందించనున్నారు. ప్రకాశం జిల్లా, ఒంగోలు నగరానికి చెందిన ఆయన చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక భావాలతో పెరిగి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొ ని ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో ధర్మ, సేవా విధానాల అభివృద్ధి, ఆలయాల నిర్వహణ విధానాల పునర్వ్యవస్థీకరణ, స్థానిక భక్తుల, దాతలు, సేవాదారులకోసం సేవా సదుపాయాల కల్పనలో శ్రద్ధ, రవాణా, సేవల సరళతలపై సూచనలు ఇవ్వడం వంటి సేవలనందించనున్నారు.
నైతిక విలువలను పెంచే బాధ్యత చాగంటికి

సమాజంలో పేరుకు పోతున్న అసమానతలు, తిరోగమనానికి దారితీస్తున్న విషసంస్కృతి నుంచి భావి భారత విద్యార్థి లోకాన్ని కాపాడే లక్ష్యంతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును విద్యాశాఖకు సలహాదారుగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ ధార్మిక ప్రవచనకర్తగా, వేద పండితు డిగా సేవలనం దిస్తున్న ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఆయన ప్రవచనాలతో అనేకమంది ప్రభావితమవుతున్నారు. చిన్న నాటి నుంచే వేదాలు, ఉపనిషత్తులు, ఇతి హాసాలపై లోతైన అధ్యయనం చేసిన ఆయన భగవద్గీత, రామాయణం, మహాభా రతం, భాగవతంపై వేలాది ప్రవచనాలని చ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రభావవం తమైన ధార్మికవక్తగా, నైతిక విలువల ప్రచారం చేపట్టనున్నారు. కుటుంబ వ్యవస్థ యువత ప్రవర్తన, ఆత్మనియంత్రణ, సమాజ బాధ్యతలపై ఆయన నిరంతర బోధన చేయనున్నారు. మద్యం, మత్తుపదార్థాల వ్యతిరేక ఉద్యమాల్లో నైతిక సల హాదారుగా ఆయన తన పాత్ర కొనసాగించనున్నారు. అనేక రాష్ట్రస్థాయి ధార్మిక పురస్కా రాలను అందుకున్న ఆయన నడిచే వేదంగా ప్రజలచేత గౌరవింపబడుతున్నారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాలకు జి.సతీష్ రెడ్డి

ఆధునాతన అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, డీఆర్డీవో మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ జీ.సతీష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన ఆయన బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఎంటెక్, ఏరో స్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచీ చేశారు. 1985 లో డీఆర్డీవోలో చేరిన ఆయన, 2018 – 2022 వరకు డీఆర్డీవో చైర్మన్ అండ్ డిఫెన్స్ సెక్రటరీగా కొనసాగారు. ఆర్అండ్ లో ప్రస్తుతం రక్షణ మంత్రిత్వశాఖ శాస్త్రీయ సలహా దారుగా సేవలందించారు.
అగ్ని, పృథ్వి, బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలను అభి వృద్ధి చేయడంలో ఆయన ప్రధానంగా నాయ కత్వం వహించారు. భారతదేశ క్షిపణి రక్షణ వ్యవస్థ(బీఎండీ)ని రూపకల్పన చేసిన ఆయన, స్వదేశీ రక్షణ సాంకేతి కతను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. 2023లో పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. డీఆర్డీవో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ వంటి పురస్కారంతోపాటు, అనేక జాతీయ శాస్త్ర అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆత్మనిర్బర్ భారత్ డిఫెన్స్ ఆర్కిటెక్ట్, భారత రక్షణరంగ స్వావలంబనకు సతీష్ రెడ్డి మార్గదర్శకుడిగా నిలిచారు.
మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా పోచంపల్లి శ్రీధర్

ప్రముఖ కార్టునిస్ట్గా దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన పోచంపల్లి శ్రీధరు మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. కార్టూనిస్ట్, కాలమిస్టు, మీడియా విశ్లేషకుడుగా మీడియారం గంలో రాణించిన ఆయన, మూడు దశాబ్దాల కుపైగా తెలుగు జర్నలిజంలో ప్రముఖ కార్టూనిస్ట్ గా కొనసాగారు. సమాజ, రాజకీయ అంశాలను హాస్యంగా కానీ ఘాటుగా ప్రజలకు చేరువ చేసిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి ఆయనకు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవే యడంలో వ్యూహాత్మక మార్గదర్శకత్వం ఇవ్వాలని కోరుతూ, మీడియా కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, డిజిటల్ ప్రచారాలపై ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు. జర్నలిజంలో రాణించాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచే వ్యక్తుల్లో ఒకరైన శ్రీధర్ ఒక కార్టూన్ తో వెయ్యి మాటలు చెప్పగల శక్తివంతమైన కలంగా గుర్తింపు పొందారు.
