Dead | సరదా కోసం వెళ్లి.. ప్రాణం వదిలిన విద్యార్థులు

Dead | సరదా కోసం వెళ్లి.. ప్రాణం వదిలిన విద్యార్థులు

  • పాలకొలను గ్రామంలో విషాదం
  • సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్సై సునీల్ కుమార్

Dead | ఓర్వకల్, ఆంధ్రప్రభ : సరదా కోసం వెళ్లి చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి. గురువారం నూతన సంవత్సరం కావడంతో కర్నూలుకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న 9 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పాలకొల్లు గ్రామంలో నీ తల గుండమ్మయ్య అనే చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. నీరు అధికంగా ఉండడంతో 9 మందిలో ఇద్దరు విద్యార్థులు ఈదలేక మృతి చెందారు. వీరు కర్నూలులోని ఒక పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.

Dead

మృతులు కర్నూలుకు చెందిన వినయ్14, అస్లాం14 సంవత్సరాలు దీంతో పాలకొల్లు గ్రామంలో విషాద ఛాయ‌లు నెలకొన్నాయి. ఈత కొట్టడానికి వచ్చిన 9 మంది ఈత కొట్టడానికి చెరువులోకి దిగిన వినయ్, అస్లాం లోతు ఎక్కువ ఉండడంతో ఈత కొట్టలేక వినయ్, అస్లాం మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటన తెలిసిన ఓర్వకల్ ఎస్సై సునీల్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ప‌రిశీలించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేడాల్సి ఉంది.

Dead

Leave a Reply