Motkur | ఘనంగా పౌరహక్కుల దినోత్సవం

Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : పౌరహక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ పాల్గొన్నారు. ఈ రోజు మండలంలోని పాటిమట్ల గ్రామం దళిత వాడ లో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం లో ఆయన మాట్లాడుతూ గ్రామంలో కులమతాలకతీతంగా ప్రతిఒక్కరు ఉండాలని సూచించారు. దళితులను కులం పేరుతో చిన్నచూపు చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బండ రమ విజయ్ రెడ్డి, ఆర్ఐ సుమన్, సీడీపీఓ యామిని, వార్డెన్ రాజాలు బాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply