Traffic jam | టాపిక్ సమస్య లేకుండా చూడాలి…
Traffic jam | చిట్యాల, ఆంధ్రప్రభ : రాబోయే సంక్రాంతి పండక్కి వాహనదారులకు ట్రాఫిక్ జామ్(Traffic jam) కాకుండా చూడాలని ఎన్ హెచ్ ఎ ఐ అధికారులను నల్లగొండ జిల్లా ఎస్పి శరత్చంద్ర పవర్ హెచ్చరించారు. సోమవారం నాడు చిట్యాల, వెలిమినేడు, పెద్ద కాపర్తిలో జాతీయ రహదారి 65 జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిట్యాల లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి(railway underbridge) వద్ద ఉన్న గుంతల ను మరమ్మతు చేయాలని పట్టణంలో ఉన్న గుంతలను పూడ్చకుండా వదిలేసిన అధికారులను ఎస్పి మందలించారు. పండగలప్పుడు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డుపై తగిన ఏర్పాట్లు చేయాలని నేషనల్ అథారిటీ అధికారులకు బ్రిడ్జి కాంట్రాక్టర్కు ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశించారు బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, సిఐ కె నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


