Road Accident | గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం

Road Accident | గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం

  • బైక్‌ను ఢీకొట్టిన ట‌వేరా వాహ‌నం
  • భార్యాభర్తల మృతి

Road Accident | గొల్లపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట భారత్ పెట్రోల్ పంపు వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో అబ్బపూర్ గ్రామానికి చెందిన రెడ్డపాక లింగయ్య, లచ్చవ్వ ఇద్దరు మృతి చెందారు. రెడపాక లింగయ్య అతని భార్యను తీసుకొని హైదరాబాద్ వెళ్లే నిమిత్తం బండిపై జగిత్యాల వ‌ద్ద ఎదురుగా వస్తున్న టవేరా వాహనం ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న ల‌చ్చ‌వ్వ అక్కడికక్కడే మృతి చెందగా.. లింగయ్యను జగిత్యాలకు తరలిస్తుండగా మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply