Mendora | రిజర్వేషన్లు అమలు చేయాలి

Mendora | రిజర్వేషన్లు అమలు చేయాలి
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసరి మూర్తి
Mendora | మెండోర, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసరి మూర్తి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. పార్లమెంట్ సమావేశంలో బిల్లు తీసుకొచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ చైతన్యంతో సర్పంచులుగా 50 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు ఎన్నికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మిని ఈ రోజు మెండోర మండల మహిళా అధ్యక్షురాలు కళావతి సన్మానించారు.
