Chittoor పార్లమెంటరీ పార్టీ నూతన కార్యవర్గం

Chittoor పార్లమెంటరీ పార్టీ నూతన కార్యవర్గం
- అన్ని నియోజకవర్గాలకు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం
- పార్టీ బలోపేతమే లక్ష్యం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణతో కూడిన పూర్తి స్థాయి పార్లమెంటరీ పార్టీ కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది. అధ్యక్షుడు నుంచి సోషల్ మీడియా సమన్వయకర్త వరకూ వివిధ హోదాలకు అనుభవజ్ఞులైన నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు.
పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నగరి నియోజకవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డిను నియమించారు. పార్టీ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక బాధ్యతలతో పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పూతలపట్టు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన వై. సునీల్ కుమార్ చౌదరికి బాధ్యతలు అప్పగించారు.
పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులుగా తొమ్మిది మందిని నియమించారు. వీరిలో నగరి నుంచి దాసరాద్ వాసు, పలమనేరు నుంచి సి. రామచంద్ర నాయుడు, పూతలపట్టు నుంచి ఆర్. నరసింహులు నాయుడు, గంగాధర నెల్లూరు నుంచి ఎం. రవి యాదవ్, చిత్తూరు నుంచి కె. మికెల్, చంద్రగిరి నుంచి రమణ రెడ్డి, కుప్పం నుంచి నాగభూషణం రెడ్డి, పలమనేరు నుంచి మంజులమ్మ, అలాగే నగరి నుంచి డి. ధనంజయులు నాయుడులకు ఉపాధ్యక్ష హోదాలు కేటాయించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యతలతో పార్లమెంటరీ పార్టీ సంఘటనా కార్యదర్శులుగా పలువురిని నియమించారు. ఈ జాబితాలో చిత్తూరు నుంచి ఎస్. అక్తర్ బాషా, నగరి నుంచి సుజాత, పలమనేరు నుంచి ఎస్. సుబ్రమణ్యం రెడ్డి, పూతలపట్టు నుంచి వేనుగోపాల్, చంద్రగిరి నుంచి బి. అమ్ములు, కుప్పం నుంచి నారాయణ, గంగాధర నెల్లూరు నుంచి తెరుగుపూర్ణిమ, గంగాధర నెల్లూరు నుంచే కె. చెంగల్రాయ రెడ్డి, అలాగే చంద్రగిరి నుంచి అంబకుల మున్నార్ సాహెబ్లకు బాధ్యతలు అప్పగించారు.
పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక బాధ్యతలతో పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధులుగా తొమ్మిది మందిని నియమించారు. వీరిలో నగరి నుంచి ముని భాస్కర రాజు, పూతలపట్టు నుంచి టి. హేమగిరి (చిట్టి), గంగాధర నెల్లూరు నుంచి టి. మురళీ మోహన్, పలమనేరు నుంచి బాఠి గౌడు, చిత్తూరు నుంచి శశికర్ బాబు, చంద్రగిరి నుంచి ఎం. వెంకటేష్ బాబు, కుప్పం నుంచి పి.సి. శంబశివ, నగరి నుంచి బి.ఆర్. యుగంధర్, అలాగే చంద్రగిరి నుంచి పులిచర్ల మహేష్లు ఉన్నారు.
అలాగే పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులుగా పూతలపట్టు నుంచి పి. రవి, చంద్రగిరి నుంచి సి. పరంధాం యాదవ్, కుప్పం నుంచి శ్రీమతి పద్మమ్మ, నగరి నుంచి తిరుమండ్యం మంజు భారతి, పూతలపట్టు నుంచి కె. ధరణి ప్రకాశ్, కుప్పం నుంచి వి. జయలక్ష్మి, గంగాధర నెల్లూరు నుంచి ఎం. నాగిని, పలమనేరు నుంచి ఎస్. పర్వీన్, పలమనేరు నుంచే సి. విశ్వనాథ్లకు బాధ్యతలు అప్పగించారు.
పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన పి.సి. స్వామిని నియమించగా, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా చిత్తూరు నుంచి ఎన్. మోహన్ రాజును కొనసాగించారు. మీడియా విభాగంలో పార్లమెంటరీ మీడియా సమన్వయకర్తగా చిత్తూరు నుంచి కె. ఉదయ్ కుమార్, సోషల్ మీడియా సమన్వయకర్తగా పూతలపట్టు నుంచి లత బాబు నాయుడుకు బాధ్యతలు అప్పగించారు.
ఈ కమిటీ నియామకాలతో చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, రానున్న రాజకీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే దిశగా కార్యాచరణ రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
