Competitions | క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ

Competitions | క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
- పది బహుమతులు, చాంపియన్షిప్ కైవసం
Competitions | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట ప్రసాద్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన మూడవ జోన్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో తమ పాఠశాల చెందిన విద్యార్థులు 10కి పైగా బహుమతులు గెలుపొందడంతో పాటు అండర్ -17 కేటగిరీలో ఛాంపియన్షిప్ సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ వెంకటప్రసాద్, పిఈటి శానవాజ్ లు అభినందించారు.
