Kurnool | నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలి

Kurnool | నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలి
- రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారు, చెడు నడతకు పాల్పడుతున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించాలని హితవు పలికారు. భవిష్యత్తులో చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నేరాలకు పాల్పడకుండా మార్పు దిశగా అడుగులు వేయాలని సూచిస్తూ కౌన్సిలింగ్ ముగించారు.

