MLA | పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం : చీఫ్ విప్ జీవీ

MLA | శావల్యాపురం, ఆంధ్రప్రభ : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు అన్నారు. శనివారం శావల్యాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.

అనంతరం పారిశుద్ధ్య నిర్వహణ కోసం కేటాయించిన ఎలక్ట్రానిక్ వాహనాలు మరియు రిక్షాలను జెండా ఊపి ప్రారంభించి, కార్మికులకు అందజేశారు. గ్రామాల్లో అహర్నిశలు కష్టపడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply