KTR | కొత్త సర్పంచ్‌లకు అండ

KTR | కొత్త సర్పంచ్‌లకు అండ
- పంచాయతీ ఎన్నికల్లో సత్త చాటిన బీఆర్ఎస్ శ్రేణులు
- ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్
- సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యేఏ కేటీఆర్ తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్(Legal Cell)ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కొత్త సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు(BRS ranks) సత్తా చాటారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి ఏదో ఒక కేసులో ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారని, మీరు ఎవరికీ భయపడొద్దని సూచించారు.
సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి తిరగడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ అన్నారు. విజయోత్సవాల(Victory celebrations) పేరుతో రేవంత్ రెడ్డి జిల్లా జిల్లాకు తిరిగి పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేశాడని తెలిపారు. కాంగ్రెస్ సర్పంచులను గెలిపించకపోతే ఇండ్లు ఇవ్వం, మెడలు పట్టుకొని తోసేస్తాం అని ఎమ్మెల్యేలు బెదిరింపులకు(To threats) దిగుతున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ అనే సోదరుడిని కాంగ్రెస్ గుండాలు కిరాతకంగా దాడి చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిప్పర్తి మండలంలో మన పార్టీ నుంచి మహిళా అభ్యర్థి సర్పంచుగా నామినేషన్ వేస్తే, కోమటిరెడ్డి అనుచరులు ఆమె భర్తను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారని తెలిపారు. ఇంకో దగ్గర మనకు ఓట్లు ఎక్కువ పడ్డాయని, మనకు పడిన ఓట్లను ఎత్తుకెళ్లి మోరిలో వేశారన్నారు. ఇలా ఎన్నో దౌర్జన్యాలు చేసినా, అధికార పార్టీ దుర్మార్గాలను తట్టుకొని రెండు విడత(Two installments)ల్లో సత్తా చాటిన గులాబీ దండుకు, శ్రేణులకు నేను శిరస్సు వంచి అభినందనలు తెలియజేశారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడతారని.. ఏదో ఒక కేసులో ఇరికించి సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారని కేటీఆర్ అన్నారు. ఎవరికీ భయపడవద్దని సూచించారు. మీకు రావాల్సిన పైసలు మోదీ, రేవంత్ రెడ్డి ఎవరూ ఆపలేరన్నారు. అది మీ హక్కు అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు మాత్రమే పని చేస్తారని.. మళ్లీ మన ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు పనిచేస్తారని తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మన పార్టీ కార్యాలయానికి వస్తే, మన నాయకత్వం, లీగల్ సెల్ మీకు అండగా ఉంటుందని అన్నారు.
