Srikakulam | లైబ్రేరియన్‌కు సన్మానం

Srikakulam | లైబ్రేరియన్‌కు సన్మానం
Srikakulam | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా లైబ్రేరియన్‌గా విధులు నిర్వహించి, ట్రాన్స్‌ఫర్‌పై గొల్లపూడికి వెళ్తున్న సుజాతను కూటమి నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ (MPTC) సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), ఉప సర్పంచ్ శీలం శ్రీనివాస్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాసం రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు కొండవీటి నాని పాల్గొని, ఆమెను సన్మానించారు. గ్రామంలోని విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంలో ఆమె పాత్ర కీలకమని పేర్కొంటూ, కొత్త ప్రాంతంలో కూడా ఇదే విధమైన సేవలు అందించాలని, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిరాల కనకదుర్గ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
