Elections | గెలుపు దక్కినా…

Elections | గెలుపు దక్కినా…
- పగ్గాలు మాత్రం ఆఖరికి
Elections | రాయపోల్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలుగా ముగిశాయి. మూడో విడత పంచాయితీ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో సర్పంచులు గెలుపొందినప్పటికీ, పాలక వర్గాలుగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం ఇంకా నిరీక్షణ తప్పడం లేదు. మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరమే రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల పాలక వర్గాలకు అధికారికంగా పగ్గాలు అప్పగించనున్నారు.
ఈనేపథ్యంలో ఈనెల 20న సర్పంచులు బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. రాయపోల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని 44 గ్రామ పంచాయితీల 44 మంది సర్పంచులకు, 380 వార్డు సభ్యులకు, అందులోనుండి 44 మంది ఉపసర్పంచ్ లు అదే రోజు నుంచి అధికారిక గుర్తింపు లభించనుంది. అప్పటి వరకు ప్రమాణ స్వీకారాలు, అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. మూడో విడత ఎన్నికలు ముగిసిన తర్వాతే గ్రామస్థాయిలో పాలన పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
