New bridge | సూపర్ ఫాస్ట్‌గా..

New bridge | సూపర్ ఫాస్ట్‌గా..
వడివడిగా కొనసాగుతున్న ఓవర్ బ్రిడ్జి పనులు
New bridge | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్, హైదరాబాద్ మార్గంలోని పాత రైల్వే ఓవర్ బ్రిడ్జి (Old Railway over Bridge) స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతమయ్యాయి. రెండేళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణం ఇటీవల కాలంలో చురుకుగా సాగుతోంది. వికారాబాద్ నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ఈ మార్గం గుండా వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తిచేసేలా ఆర్ అండ్ బీ రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
