aim 2028 | ఇలాగైతే.. ప్రత్యామ్నాయంగా ఎదిగేదెలా

aim 2028 | ఇలాగైతే.. ప్రత్యామ్నాయంగా ఎదిగేదెలా
వర్క్ షాప్ లు పెట్టినా ముందుకు పడని అడుగు
పంచాయతీ ఫలితాలపై బీజేపీ నేతల్లో అంతర్మథనం
మూడో స్థానంలోనైనా నిలవలేకపోయామని నిట్టూర్పు
2028లో అధికారం చేపట్టాలన్న లక్ష్యం నెరవేరేనా?
తెలంగాణ కమలనాథుల పనితీరుపై మోడీ పెదవి విరుపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పంచాయతీ ఎన్నికల తొలి తాల్లో పార్టీ 200లోపు విడత ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడడం స్థానాలకే పరిమితమ లేదు. గతంలో కంటే మెరుగ్గా రాణించామని పైకి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఫలితాలపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాల్లో కనీసం స్వతంత్రులకు పోటీగా మూడో స్థానంలోనైనా పార్టీ నిలబడకపోవడంపై బీజేపీ రాష్ట్ర నాయ కత్వంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్న్యాయం బీజేపీనేనని ప్రజల్లోకి ఎలా వెళ్లగలమన్న ప్రశ్న ఇప్పుడు బీజేపీ నాయకత్వాన్ని వెంటాడుతున్నది.

తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామస్థాయిలో బలోపేతం కావాలని కార్యచరణను సిద్ధం చేసింది. అయితే తొలి విడత స్థానిక ఫలితాలు పార్టీ బలం పెరుగుతోందన్న భావ నకు అనుగుణంగా రాలేదు. ఇదే విమర్శ బీజేపీ వర్గాల నుంచే వినిపించడం ప్రాధాన్యత సంతరించు కుంది.
ఆశించిన స్థాయిలో గ్రా మాల్లో పార్టీ పటిష్టం కావడం లేదని పలువు రు బీజేపీ రాష్ట్ర నేతలే అంటుండటం గమనార్హం.
స్థానిక ఎన్నికలను బీజేపీ తేలిగ్గా తీసుకు న్నదని, నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం సం యమనంతో వ్యవహరించలేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు కాలేదని ఓ ముఖ్య నేత చెప్పడం బట్టి స్థానికంపై రాష్ట్ర శాఖ ఎంత కష్టపడిందో అర్థమవుతోంది.
aim 2028 |కొన్ని నియోజక వర్గాల్లో కనిపించని ఊపు
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో బీజేపీ ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా సాధించలేక పోయింది. వరంగల్, జనగామ జిల్లాల్లో ఒక్కో స్థానం మాత్రమే దక్కించుకుంది. పార్టీ ఎంపీ ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ రెండు స్థానాలకే పరిమితం కావడం పట్ల ఆ పార్టీ కొంత అసంతృప్తితో ఉంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 23 స్థానాలను గెలవ గా నిర్మల్లో 18, నిజామాబాద్లో 16, కరీంనగర్లో 13, సిద్దిపేటలో 11 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీ ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. నిర్మల్ నియో జకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేష్ రెడ్డి సత్తా చాటి సర్పంచ్ స్థానాలను గెలిపించుకు న్నారని……..మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
