Operation | జిల్లాలో కార్డెన్ సెర్చ్

Operation | జిల్లాలో కార్డెన్ సెర్చ్
- సరైన ధ్రువపత్రాలు లేని 15 బైకులు స్వాధీనం
Operation | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ నేర నియంత్రణే లక్ష్యంగా, ప్రజల రక్షణ వారి భద్రతకు భరోసా కల్పించేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ను ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరానేణ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన పెసరవాయి, మహానంది పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఆత్మకూరు సబ్ డివిజన్లోని వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంతకందాల గ్రామంలో ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది నేటి తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో సరైన ధ్రువపత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను, 22 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ… నేరాలను ముందస్తుగా అరికట్టి గ్రామాలలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై నిఘా కొరకు, ప్రజల రక్షణ వారి భద్రతకు పోలీసులు ఉన్నారనే భరోసా కల్పించడం.. ప్రతీచోట పోలీసుల నిఘా ఉంటుందని సుస్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించవచ్చు అనే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు.

అనుమానాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లు, నేర చరిత్ర గలవారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందని, రౌడీషీటర్లకు నేరచరిత్ర గల వారికి అక్కడే కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిల్ ను తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చిన్నారులపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యత మొదలగు వాటిపై అవగాహన కల్పించడంతో పాటు పోలీసు వారి తక్షణ సహాయం కొరకు 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి పోలీసు సహాయం పొందవచ్చునని తెలిపారు.
